Tynsel Group.com

Hey! Build Your Life
With
Tynsel Bible.Ai

About Images

Dr.R.Surendra Pal

CEO
Tynsel Bible.Ai

మీ అందరికి యేసు క్రీస్తు నామమున వందనములు, నాకు 19 ఏప్రిల్ - 2025, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పూర్తిగా కుడి కాలు, కుడి చేయి పనిచేయలేదు. ఒక నెలలో లేచి నడువగలిగాను. కానీ దేవుడు అద్భుతం చేసి 20 ఆగస్ట్ 2025 తేదీన ఈ ప్రాజెక్ట్ ను ఎడమ చేతితో మొదలు పెట్టడానికి దేవుడు సహాయం చేసాడు, డిసెంబర్ -2025 నెలకు ప్రాజెక్ట్ పూర్తియినది.
కొన్ని లైసెన్స్ రావటానికి సమయం పట్టింది. దేవుడు మరల నా జీవితంలో దేవుని కార్యం & దేవుని పనులు ఎలా జరుగుతాయో ఋజువు చేసాడు. నా కుటుంబము నన్ను ఎంతగానో ప్రేమించి బాగా చూసుకున్నారు. చనిపోలసిన నన్ను దేవుడే బ్రతికించాడు.

విధ్య అనేది ఒక ఉధ్యమం, చీకటి నుండి వెలుగు వైపుకు నడుపుతుంది."

" ఈ ప్రాజెక్ట్ మతమునకు సంబందించింది కాదు కాని ఒక చరిత్రకు సంబందించింది Tynsel Bible. Ai లో చాలా సంగతులు ఉన్నాయి. క్రైస్తవులకు బైబిల్ను గూర్చిన బేసిక్స్ సరిగ్గా లేవని గుర్తించి, రెండు సం||ల క్రితం. ఈ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాను కొన్ని పరిస్తితుల వలన చేయలేకపోయాను. కానీ ఇప్పుడు దేవుని సహాయంతో చేయగలుగుతున్నాను. ఈ కోర్స్ ద్వారా అనేకమైన బైబిల్ సంగతులు నేర్చుకునేందుకు ఒక్క వీడియోను 2-3 సార్లు తప్పక చూడండి అప్పుడు సబ్జెక్టును బాగా నేర్చుకోగలుగుతారు. మెటీరియల్ PPT / PDF ను బాగా ఉపయోగించండి మరియు డిజిటల్ సేవలను బాగా ఉపోయోగించుకోగలరు
చదువురాని వాళ్ళనుకూడా దృష్టిలోపెట్టుకొని ఈ ప్రాజెక్టు చేసాము. ప్రార్ధనా పూర్వకముగా ఉపయోగించుకోండి. దేవుని కోసం అన్వేషణ చేసేవారికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. దేవున్ని గూర్చి మరింతగా తెలుసుకుంటారు అని నమ్ముచున్నాను. దేవుని స్థాయి చాలా గొప్పది.
ఇప్పటి వరకు దేవునికి 40% ధనము ఇచ్చాను. ఇక మీదట 70% ధనము ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను..
" అది యొక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య ఆరువందల ఆరువదియారు (666) ఇందులో జ్ఞానము కలదు." ప్రకటన 13:18 ఎప్పుడో 2000 సం॥ల క్రితం రాసింది ఇప్పుడు నెరవేరబోతోంది.
ఇంకా ఇతర విషయాల కోసం మా వెబ్సైట్లో నా యొక్క సాక్ష్యం చూడండి.......

  • CEO, Tynsel Technologies Pvt Ltd
  • Nellore,AP,India
  • Signature Images