Dr.B.PADMAVATHI
BSc.,MPT.,M.Th
Vice-President
Tynsel Bible Ai
వేదాంత విద్య అనగానే,
అది మనకు సంభందించినది కాదు, కేవలము సేవకులకు లేక సువార్తికులకు మాత్రమే సంభందించినది అనే భావనలో ఉండిపోవడం అనారోగ్య ఆధ్యాత్మితకు ( Unhealthy Spirituality ) మరియు ఆధ్యాత్మిక అంధత్వానికి (Spiritual Blindness) దారితీస్తుంది అని చెప్పుటకు నేను సందేహించడం లేదు.
ఎందు చేతనంటే “వేదాంత విద్య”, దీనినే మనము ఆంగ్లములో "తియాలజి" (Theology ) అనగా తియోస్ (Theos) మరియు లోగోస్ (Logos) అనే రెండు గ్రీకు పదాలనుంచి తీసుకోవడం జరిగినది.
తియోస్ (Theos) అనగా “దేవుడు” ఆలజి (Ology) అనగా “ఆధ్యాయనం” (Study) చేయడం.
ఒక్క మాటలో చెప్పాలంటే మనలను సృస్టించిన సృష్టి కర్తను గూర్చి తెలుసుకోవడం, ఇది మన అందరి బాధ్యత మాత్రమే కాదు గాని ప్రభువు యొక్క ఆజ్ఞ కూడాను.
అయితే, సాంకేతికంగా ఎంతో అబివృద్ది చెందిన ఈ దినాలలో అందరు , ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఇంటర్నెట్ మీద ఆదార పడడం, ఇంటర్నెట్ ముందు ఎంత సమయాన్ని అయినా వెచ్చించడానికి ఆశ కలిగియుండడాన్ని గమనించి, ప్రభువు ఇచ్చిన తలంపు మరియు భారంతో సహోదరులు డా. ఆర్. సురేంద్ర పాల్ గారు ప్రతి ఒక్కరు దేవుని గురించి పరిశోధించి తెలుసుకోవాలని ఎంతో మంది దైవసేవకులు, మరి ప్రత్యేకంగా బైబిల్ టీచర్స్ సహాయంతో ఈ ఆన్లైన్ కోర్సును ప్రారంభించడం జరిగినది.
ప్రభువు యొక్క దైవత్వం మరియు వ్యక్తిత్వం , విశ్వాసి యొక్క బాధ్యతలు,
ఇలా ఇంకా అనేక సబ్జక్ట్స్ ని అత్యంత తక్కువ ధరకే అందించడం చాల సంతోషకరం.
నాకు కూడా ఇంత చక్కటి అవాకాశం కల్పించిన దేవునికి మరియు (Tynsel Bible. Ai Management) వారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
ఇట్లు క్రీస్తు నందు మీ సహోదరి
- Watch my Testimony
Copyright © 2025 Tynsel Technologies All Rights Reserved